పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు అందించాలి – విలేకరుల సమావేశంలో సూర సమ్మయ్య డిమాండ్ జనంసాక్షి , కమాన్ పూర్ :
పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య విలేకరుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59 ద్వారా మీ సేవలో ఆన్లైన్లో నమోదు చేసుకోండి ఫ్రీగా పట్టాలి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 125 గజాల వరకు మాత్రమే ఇస్తానని చెప్పి మిగతా భూమికి లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక్క నీరుపేదకు కూడా పట్టా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా అని ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది .ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని,
లేని పక్షంలో పేద ప్రజలకు ఎల్లప్పుడు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్ గారు, కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్,మాజీ ఉపసర్పంచ్ శంకర్ నాయక్, గండికోట వెంకటేష్,కలవేన శ్రీనివాస్, బూతగడ్డల రమేశ్, సంపంగి సంతోష్, కొమిరే శంకర్, సంతపూరీ కనకయ్య, చిలగని రాజేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.