Wednesday, 4 November 2026

పేదలకు భోజనం అందించాలన్నదే లక్ష్యం

అన్నపూర్ణ క్యాంటీన్‌ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కొంపల్లిలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి కోసం రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. కొంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అన్ని సేవలు ఒకే చోట ఉండడం వలను ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు మంత్రి. దాదాపు అన్ని విభాగాల సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానందతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.