పేదల పెన్నిధి… ఆపద్బాంధవుడు నిఖిల్ రెడ్డి.

నిఖిల్ అన్న సేవలకు ప్రజల జేజేలు.
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన మొల్ల రసూల్ (70) అనారోగ్యంతో బాధపడుతు బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి గారికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, డీ ఎన్ ఆర్ యువసేన సభ్యులు సర్పంచ్ దృష్టి కి తీసుకు వెళ్లగా వెంటనే స్పందించారు. స్థానిక నాయకులకు ఐదు వేల రూపాయలు పంపించారు. స్థానిక నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.5000/- అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని బాధితులకు అండగా ఉంటున్న నిఖిల్ అన్నకు మండల ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు నరసింహ్మ, వార్డు సభ్యులు రవి వాల్మీకి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, కాంగ్రెస్ సేవ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, కాంగ్రెస్ సేవదల్ మండల అధ్యక్షుడు పోలె గణేష్, టౌన్ ప్రెసిడెంట్ అరిఫ్, నాయకులు షబ్బీర్, ఖాజా, దయాకర్, డీఎన్అర్ యువసేన సభ్యులు దార రాజు, అది నారాయణ , శివ తదితరులు ఉన్నారు.