మృతుడి కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ
టిఆర్ఎస్ మండల నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
ఊరుకొండ మండల కేంద్రంలో ముస్లీం కుల పెద్దలు అయిన రసూల్(70) అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం స్థానిక తెరాసా నాయకులు ద్వారా మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సహాయంగా రూ.5000/-, మరియు కబడ్డి, కరాటే అసోసియేషన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రూ.5000/- బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల సర్పంచ్ కొమ్ము రాజయ్య, ఉప సర్పంచ్ నారాయణ, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్, మండల నాయకులు కొమ్ము శ్రీను, బండి మల్లేష్, వార్డ్ నంబర్ ఆంజనేయులు, పోలే చందు, లాల్ కోట శ్రీనివాసులు, పోలే లక్ష్మయ్య, వీళ్ళందరి చేతుల మీదుగా మృతుడి కూతురు అయిన జహంగీర్ బీ గారికి అందజేయడం జరిగింది. ఎవరికి ఆపద వచ్చినా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.