పేదోళ్లకు అండ ఎర్రజెండా
గరిడేపల్లి, అక్టోబర్ 12 (జనం సాక్షి): పేదోళ్లకు వెళ్ళ వేళ్ళలా అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ జాతీయ మహాసభల సందర్భంగా అక్టోబర్ నెల 14 వ తారీఖున జరిగే బహిరంగసభ మహా ప్రదర్శన లో కార్మికులు కర్షకులు పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి పోరాట కార్యక్రమాలు రూపొందిస్తారని ఆయన అన్నారు. 14వ తారీఖున జరిగే బహిరంగ సభలో బిజెపి మతోన్మాదాన్ని వ్యతిరేకించే కేరళ తెలంగాణ తమిళనాడు బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కమ్యూనిస్టు అగ్ర నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు.ఈ ప్రచార కార్యక్రమం లో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, జొన్నలగడ్డ తిరపయ్య, ఇదా సైదులు, ఇదా నాగేశ్వరావు, పంగ గోవిందా, పంగ సైదయ్య, షైక్ నబి, ముండ్ల కోటయ్య, మచ్చ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.