పేద కుటుంబానికి అండగా నిఖిల్ రెడ్డి..
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 16 (జనంసాక్షి):
అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య చికిత్స నిమిత్తం కాంగ్రెస్ నాయకులు తమవంతు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన పోలె ప్రభావతి రమేష్ దంపతుల చిన్న కుమారుడు రిక్కి గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి వెంటనే రూ.5000/- డిఎన్ఆర్ యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు రవి వాల్మీకి రూ.2000/-, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు రూ.1000/-, కాంగ్రెస్ పార్టీ సేవాదల్ మండల అధ్యక్షుడు పోలె గణేష్ రూ.1000/-, నిఖిల్ అన్న యువసేన సభ్యుడు ఆదినారాయణ రూ.1000/- మరియు కాంగ్రెస్ యువ నాయకుడు దార రాజు రూ.1000/- బాలుడి చికిత్స నిమిత్తం అంద జేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దయాకర్, గోపాల్, శివ, తదితరులు ఉన్నారు.