మృతుడి కుటుంబానికి అండగా ధ్యాప నిఖిల్ రెడ్డి

– మండల కాంగ్రెస్ నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 16 (జనంసాక్షి):
ఊరుకొండ మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిగా ఆదుకుంటూ మృతి చెందిన కుటుంబాలకు అండగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి నిలుస్తున్నారని కాంగ్రెస్ మండల నాయకులు ఆన్నారు. శుక్రవారం ఊరుకొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చాకలి బలరాం అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ విషాద వార్తను
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డికి తెలియజేశారు. ఈ విషాద వార్తను విన్న ధ్యాప నిఖిల్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిఖిలన్న యువసేన పేరిట తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5000/- అందజేశారు. ఈ నగదును కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగారెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , ఓర్సుఆంజనేయులు ,అనిల్ ,కొత్త ఆంజనేయులు, రామ్, శివ, నందు, మహేష్, శ్రీను, ఆంజనేయలు , తదితరులు పాల్గొన్నారు.