*పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.
* ఎమ్మెల్యే గండ్ర.
చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న ఆసరా పెన్షన్ కార్డులను శనివారం మండలంలోని కాల్వపల్లి,గిద్దెముత్తారం, అందుకుతండా,వెంచరామి, చైన్ పాక,నైన్ పాక గ్రామాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ కార్డులని పంపిణీ చేసారు. అనంతరం గిద్దెముత్తారం ప్రాథమిక పాఠశాలని సందర్శించారు.అదే విధంగా అర్హులైన 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపపీ దావు వినోద, జడ్పీటీసీ లు గొర్రె సాగర్, పులి తిరుపతి రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,స్థానిక సర్పంచ్ పులి సునీత అంజిరెడ్డి,పొలవెన పోశాలు,కచ్చు మల్లేష్, సిద్దంకి భాస్కర్,రేణికుంట్ల స్వరూప, తొట్ల లక్ష్మీ, ఎంపీటీసీ పప్పుల సంజీవ్, భూక్య సుజాత, మండల పార్టీ అధ్యక్షుడు అరపెళ్లి మల్లయ్య , ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.