హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్ పరిశీలిస్తున్నారు.బేగంపేట విమానాశ్రయం నుంచి సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధాని రోడ్డు మార్గంలో దిల్‌సుఖ్‌నగర్ వచ్చారు. ఘటన ప్రాంతంలో పర్యటించి ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, పోలీసు ఉన్నాతాధికారులు ఉన్నారు. అనంతరం ప్రధాని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించానున్నారు.




