పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.మైనింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు.


కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పోతంగల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోతంగల్ ఆర్ఐ తన రెవెన్యూ సిబ్బందితో కలిసి మూకుమ్మడి దాడి చేశారు.ఈ దాడిలో మంజీరా నది నుండి అక్రమ ఇసుకతో వస్తున్న టిఎస్ 16 యుబి 3452 నంబర్ గల ఒక ఇసుక టాక్టర్నీ పోతంగల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో మంగళవారం అర్థరాత్రి 12:00 సమయంలో పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామని పొతంగల్ అర్ఐ రంజిత్ కుమార్ పేర్కొన్నారు.ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని అర్ ఐ తెలిపారు.