హైదరాబాద్ : సిటీ సివిల్ కోర్టులో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు చుక్కెదురైంది. మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కేసు విచారణ కొనసాగుతున్నందున ప్రెస్ మీట్ ..సభలు..సమావేశాల్లో మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది. ఎలాంటి ఆధారం లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని న్యూస్ ఛానెళ్లకు ఆదేశించింది.




