పొన్నం పాద యాత్ర ను విజయ వంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 17(జనంసాక్షి) :కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాద యాత్ర హుస్నాబాద్ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పొన్నం పాద యాత్రను విజయ వంతం చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కోరారు. పొన్నం చేపట్టిన పాద యాత్ర ఎల్కతుర్తి లో గురువారం ముగుస్తుంది. ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద హుస్నాబాద్ నియోజక వర్గ పరిధి లోని అన్ని శాఖల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పొన్నం పాద యాత్రకు స్వాగతం పలకాలని, ఎల్కతుర్తి లో నిర్వహించ బోయే పాదయాత్ర ముగింపు సభను విజయ వంతం చేయాలని ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Attachments area