‘పోచారం’ అక్రమ కట్టడంపై న్యాయపోరాటం: బీజేపీ

నిజామాబాద్‌, మార్చి 28: జిల్లాలోని బాన్సువాడలో మంత్రి పోచారం నిర్మస్తున్న అక్రమకట్టడాన్ని తొలగించేవరకు పోరాడతామని బీజేపీ నేతలు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, పల్లె గంగారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటానికి తాము సిద్ధం ఉన్నట్టు చెప్పారు. బాన్సువాడ సీపీ శ్రీనివాసురెడ్డి వైఖరిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.