Monday, 2 November 2026

పోచారానికి కవిత పరామర్శ

హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని శనివారం మధ్యాహ్నం ఎంపీ కవిత పరామర్శించారు. ఆయనకు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఆపరేషన్‌ జరిగింది. యశోదలో మంత్రిని కవిత పరామర్శించారు. ఆపరేషన్‌ చేసిన విధానం గురించి మంత్రి పోచారం ఎంపీ కవితకు వివరించారు. త్వరగానే తిరిగి నడుస్తారని.. మునుపటి ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తారని ఎంపీ కవిత ఆకాంక్షించారు.