పోడు భూమి రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం మానుకోవాలి బహుజన్ సమాజ్ పార్టీ

చందంపేట (జనం సాక్షి) జూలై 20
పెద్ద మూల గ్రామంలో పోడు భూములు చేసుకున్నటువంటి రైతులను కలిసి వారి సమస్యలను సాధనకై రైతులతో బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి రామావత్ రమేష్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్ర కృష్ణ జాంభవ్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం లోని పెద్దమూల గ్రామపంచాయతీ పరిధిలో పొడి చేసుకుని గత అరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ అధికారులు గత నాలుగు నెలలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ పట్టా భూముల లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ఏంటి అని ప్రశ్నించారు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు వెంటనే పోడు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని లేకపోతే ఫారెస్ట్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరించారు బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాలు అందించి రైతులకు పూర్తి హక్కు అందిస్తామని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు రైతుల రైతుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఆంజనేయులు నాగరాజు ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు