పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలి
నల్లబెల్లి అక్టోబర్ 17 (జనం సాక్షి):
పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆర్వో ఎఫ్ ఆర్ సబ్ డివిజన్ సభ్యుడు, ఎంపీటీసీ సాపవట్ దేవ్ సింగ్ అన్నారు. మండలంలోని మూడు చెక్కలపల్లి ,గోవిందాపురం గ్రామాలలో గ్రామ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం పోటు భూముల సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ గిరిజన రైతులందరికీ అక్కుపత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ శ్రీను, ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Attachments area