Wednesday, 4 November 2026

పోరాడితేనే తెలంగాణ వస్తుంది: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు న్యాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధింగలమని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్రులు అన్ని రకాలుగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర పార్టీ టీడీపీలో ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేయలేమని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరానని ఆయన తెలిపారు. నేనే తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాను తప్పా పదవుల కోసం కాదు అని పోచారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *