Wednesday, 4 November 2026

భీమ్‌గల్‌ లో ఘనంగా దసరా పండుగా

భీమ్‌గల్‌, అక్టోబర్ 19 (జనంసాక్షి) : మండలకేంద్రంతో పాటు మండలములోని ఆయ గ్రామాలలో గురువారం దసరా పండుగాను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండలకేంద్రంలోని నందిగల్లి నంధీశ్వరాలయం ఆవరణ వద్ద దసరా పండుగా ఏర్పాట్లను గ్రామాభివృద్ధి కమిటి వారు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల 30 నిముషాల సమయంలో జంబి కొమ్మకు పూజరి పూజలు నిర్వహించారు. అనంతరం జంబిని ప్రజలకు పంచారు. ఒకరికొకరు జంబి బంగారం ను పంచుకుంటు దసరా శుభాకాంక్షలు తెల్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కర్నె గంగయ్య, వీడీసీ సభ్యులు, ఎంపీపీ కొండ గోదావరి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండ ప్రకాష్ గౌడ్, జడ్పీటీసీ బాదవత్ లక్ష్మీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాదవత్ శర్మనాయక్, వైస్ ఎంపీపీ శివసారి నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మన్, మూత లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.