హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగోల్లో విషాదం చోటుచేసుకుంది. పోలియో వ్యాక్సిన్ వికటించి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. పల్లవి అనే చిన్నారికి శనివారం అంగన్ వాడీ సిబ్బంది పోలియో వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే… అది వికటించి చిన్నారి ఆదివారం మృతిచెందింది. అప్పటివరకు కేరింతలు కొడుతూ ఉన్న తమ పాపకు పోలియో వ్యాక్సిన్ ఇప్పించి తమ బిడ్డను తామే పోగోట్టుకున్నామని ఆ చిన్నారి తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది




