సికింద్రాబాద్ ( జనం సాక్షి ) ఆదివారం అడ్డగుట్టలో జరిగిన బోనాల జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన తుకారం గేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వారి సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమని బిజెపి ఓబీసీ సికింద్రాబాద్ ఆసెంబ్లీ కన్వీనర్ రాజుగౌడ్ అన్నారు . శాంతి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సేవలు అందించిన తుకారంగేట్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించి శాంతి భద్రత కాపాడడం మా బాధ్యతని ఎల్లప్ప అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో, బిజెపి నాయకులు నందు, శ్యామ్ పాల్గొన్నారు.
Attachments area




