వీఆర్ఏల నిరవధిక సమ్మెకు బీఎస్పీ పార్టీ సంపూర్ణ మద్దతు

 పాన్ గల్ జూలై 29 ( జనం సాక్షి )
వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర పాన్ గల్ మండల కేంద్రంలో వి ఆర్ ఏలు చేపట్టిన నిరధిక సమ్మెకు గురువారం బీఎస్పీ నేతలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ కేశపాక వెంకటేష్, అసెంబ్లీ అధ్యక్షులు మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వి ఆర్ ఏ హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రధానంగా స వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలని , అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేసి,ప్రభుత్వాన్ని గద్దె దించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో భోజన రాజ్యం సాధించుకుంటామని, అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని, రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ మండల కన్వీనర్ ఆంజనేయులు, పెరుమాళ రామకృష్ణ , పరమేష్, గడ్డం రామకృష్ణ,, కన్వీనర్ రాము మరియు మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షులు సురేష్ కుమార్ , కార్యదర్శి, బషీర్, ఉపాధ్యక్షులు నరసింహ, రాజు, రామకృష్ణ , అరుణమ్మ, రజిత, సునీత, నాగరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area