పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని స్థానిక 48వ వార్డ్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు.బుధవారం ఆ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాలలో ఆయన పొల్గొని మాట్లాడారు.తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరు విటమిన్లు, మినరల్స్, అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నగీత, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.