పోస్టల్ శాఖలో తక్కువ ధరకే జాతీయ జెండాలు
కొత్తగూడ జనంసాక్షి:ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాత్రంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.హర్ ఘర్ తిరంగా ప్రచారానికి పోస్టల్ శాఖా తమ వంతుగా ఆన్లైన్ లో జాతీయ జెండాలను చాలా తక్కువ ధరకే ప్రజలకు అందించడానికి సిద్ధమైంది.మండల పోస్టల్ శాఖ ఎస్పిఎం వెంకటేష్ మాట్లాడుతూ కేవలం 25 రూపాయలకు మాత్రమే జాతీయ జెండాను అందించడం జరుగుతుంది.ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకున్నవారికి పోస్ట్ మాస్టర్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినం చేసుకోవాలని కోరారు.