పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

జనం సాక్షి , మంథని : హర్ ఘర్ తిరంగా 2.0 లో భాగంగా మంథని పోస్టాఫీస్ పరిధిలో మంథని పోస్టాఫీసు నుండి శ్రీపాద చౌక్, గాంధీ చౌక్ మీదుగా, అంబేద్కర్ చౌక్ కలుపుకొని ఆర్టీసీ డిపో వరకు జాతీయ జెండాలతో పోస్టాఫీసు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ని, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ ని, జయశంకర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి ని కలిసి జాతీయ జెండా లను బహుకరించారు. ముఖ్య అతిథిగా మంథని సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అజహరుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రతి పోస్టాఫీస్ లో జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని, కేవలం 25/- రూపాయలు చెల్లించి జెండా పొందవచ్చునని,ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని, బుక్ చేసుకున్న మరుసటి రోజే స్థానిక పోస్టుమాన్ ద్వారా వారి ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని” తెలిపారు. ఈ తిరంగా ర్యాలిలో మంథని పోస్ట్ మాస్టర్ బి.రవికుమార్, సంజీవ్, రాకేష్, ఎం.ఓ జి.రాజు,పోస్ట్‌మ్యాన్ మధుకర్, మంథని పరిధిలోని బి.పి.ఎమ్ లు,ఎ.బి.పి.ఎం లు పాల్గొన్నారు.

తాజావార్తలు