మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – మండల యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు
మునిపల్లి, ఆగష్టు 10, జనంసాక్షి :
మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు అన్నారు. గురువారం నాడు మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ శంకర్ తో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, రుణమాఫి చేసి రైతులకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృషితో మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాన్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లయ్యతో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు