పోస్ట్ ఆఫీస్ ల్లో జాతీయ పతాకం 25 రూపాయలకు విక్రయం

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు చౌకగా 25 రూపాయలకు జాతీయ పతాకాన్ని పోస్ట్ ఆఫీసుల్లో విక్రయిస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ రాజన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పింగిలి మల్లయ్య, కోతి వెంకటరమణ, శేషారెడ్డి, షేక్ మోహినిద్దీన్, అశోక్ బాబు పాల్గొన్నారు. ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో 60 జాతీయ పతాకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.