పౌరహక్కుల పై అవగాహన కలిగి ఉండాలి*
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో ( సివిల్స్ రైట్స్ డే) పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపాలిటీ అధికారుల నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ రణపంగ నాగయ్య మాట్లాడుతూ సమాజంలో పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలని,ప్రతి పౌరుడు అవగాహణ కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ యల్లంకి వీరారెడ్డి,జూనియర్ అసిస్టెంట్ సుశీల,11వ కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్,డి.శ్రీనివాస్,ఏం సైదులు, వెంకన్న,ఆర్పి సరిత, తాళ్ల నర్సిరెడ్డి,నీల రామ్మూర్తి,సత్యం,వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.