Tuesday, 3 November 2026

ప్రధానమంత్రి సొంత రాష్ట్రం లో దళితుల మీద దాడులను ఖండించిన . ఎంపీపీబాలయ్య

జనం సాక్షి జోగుపేట ఆందోల్ .. బుధవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ బాలయ్య మాట్లాడుతూ75 సంవత్సరాలు గడుస్తున్నా సామాజిక అసమానతలు ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి ఆలయం లోకి దళిత మహిళలు రాకుండా అగ్రవర్ణ మహిళలు అడ్డగించింది గుడిలోకి మి జాతి వారికి ప్రవేశం లేదు అంటూ దుర్భాషలడిOది. మొన్న ఉత్తరప్రదేశ్ లో స్కూల్ లో కుండలో నీళ్ళు తాగడం జరిగిందని బలున్ని టీచర్ కొట్టి చంపడం జరిగింది ముఖ్యంగా  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుల అసమానతలు దళితులపై దాడులు, అంటరనితం ఎక్కువ వుంది ఈ చర్యలను  ఖండిస్తున్నా ఈ దాడులు ఇలాగే కొనసాగితే బీజేపీ కి తగిన బుద్ది చెబుతాం అన్నారు. అందోల్ మండల దళిత ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల నాయకులు  ఈ కార్య క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డేవిడ్ కౌన్సిలర్ దుర్గేష్ ఎంపిటిసి మమతా రాజు సర్పంచ్ పోశయ్య ఉపసర్పంచ్ మాణిక్యం మాజీ సర్పంచ్ డాకూర్ శంకరయ్య తెరస పార్టీ దళిత నాయకులు మొగులయ్య సతీష్ నర్సింలు గోపాల్ లింగం నర్సింలు సంగమేశ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు నాయకులు.