హైదరాబాద్,నవంబర్27 (జనంసాక్షి ) : మాదాపూర్ హైటెక్స్‌లో పౌల్టీ ఇండియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రసంగించారు. దేశంలో పౌల్టీ రంగానికి మంచి భవిష్యత్ ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో పౌల్టీ రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దాణాను సమయానికి విడుదల చేశామన్నారు. పౌల్టీ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఉత్తమ పాలసీ కోసం కృషి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పౌల్టీ విధానం తీసుకువస్తాం. తెలంగాణలో పౌల్టీ రంగం ఉపాధి కల్పిస్తోంది. కోళ్ల రైతులకు సమస్య లేకుండా చూస్తాం అని మంత్రి తలసాని స్పష్టం చేశారు.




