జుక్కల్, మార్చి 24, (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం వడ్లంగ్రామములో శుక్రవారం అంగన్ వాడి, మినీ అంగన్వాడీ కేంద్రాల ఆద్వర్యంలో కిషోర బాలికలకు పౌష్ఠికాహారం, రక్తహీనత పై అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ నసీమ, ఉపసర్పంచ్ పండరి, అంగన్ వాడి టీచర్లు ఎం. స్వరూప, వై. స్వరూప, బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు మల్లుగొండ,ఆయాలు, విద్యార్ధులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం పై కిషోర బాలికలకు అవగాహాన




