Thursday, 5 November 2026

ప్రగతి పథంలో పయనిసుౖన పల్లెలు

– జెడ్పీటీసి సుధాకర్ రెడ్డి

జగదేవ్ పూర్, ఆగష్టు 26 జనంసాక్షి :

టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెలు ప్రగతి పథం వైపు పయనిస్తున్నాయని
జగదేవ్ పూర్ మండల. జెడ్పీటీసి వంటేరు  సుధాకర్ రెడ్డి  పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఫంక్షన్ హల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి పథంలో తీసుకపోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఫంక్షన్ హల్ నిర్మాణాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సిద్దులు పాల్గొన్నారు.