ప్రగతి పనులు పరుగులు పెట్టాలి..
– నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.
– పూర్తి అయిన అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలి..
– ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలి..
– 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలి..
– సీజనల్ వ్యాదుల పై అప్రమత్తంగా ఉండాలి..
– నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఆరోగ్య వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు .
సిద్దిపేట 28,జూలై ( జనం సాక్షి )
సిద్దిపేట నియోజకవర్గం పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రగతి పనులను పరుగులు పెట్టించాలని మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్ రావు నియోజకవర్గ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల వారిగా గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పై ఆరా తీశారు. కొన్ని గ్రామాల్లో సిసి రోడ్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని వచ్చే వారం పది రోజుల్లో పనులు పూర్తి కావాలని కోరారు. పంచాయత్ రాజ్ పరిధిలోని బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని త్వరలోనే పనులు ప్రారంభించేల ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. నిర్మాణం లో గ్రామ పంచాయితీ భవనాలు , కమ్యూనిటీ భవనాలు పనులు వెంటనే పూర్తి కావాలన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని , అధికారులతో కల్సి అర్హులైన లబ్ది దారులని ఎంపిక చేయాలని సూచించారు.
– ప్రగతి పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలి.
– వచ్చే వారం పది రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటన చేస్తా.
నియోజకవర్గం లో పూర్తి అయిన అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. నారాయణ రావు పేట మండల కేంద్రం లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వచ్చే నెల మొదటి వారం లో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఇరుకోడ్, పాలమాకుల గ్రామాల్లో అర్హులైన లబ్ది దారులని ఎంపిక చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు , గృహ ప్రవేశాలు చేయాల్సిన డబుల్ బెడ్రూం లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు.గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేయాలని ఆ దిశగా అన్ని గ్రామాల్లో బూత్ స్ధాయి నుండే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లేల ప్రతి కార్యకర్త పని చేయాలని అందుకు మండల నాయకత్వం చొరవ చూపాలన్నారు.. రైతు భీమా , రైతు బందు, కళ్యాణ లక్ష్మి , కేసీఆర్ కిట్, ఇంటింటికి త్రాగు నీరు, మండుటెండలో ప్రతి పొలం కు సాగు నీరు అందిస్తున్నాం అని , ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్ధాయి చేసుకున్నామని హైదరాబాద్ కి వెళ్లకుండా ఎన్నో వైద్య సేవలు సిద్దిపేట లో అందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు, మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషన్లు ఇలా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు..
– ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలి..
సిద్దిపేట లొనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేసుకోబోతున్నామని 2వేల ఎకరాలకు మొదటి దశ గా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోబోతున్నాం వచ్చే సెప్టెంబర్ లో మరో 5వేల ఎకరాలకు సంసిద్ధం అయ్యేల చొరవ చూపాలని ప్రజాప్రతినిధులు జిల్లా అధికారి రామలక్ష్మి తో సమన్వయం కావాలని చెప్పారు.ఆయిల్ ఫామ్ సాగు ఎంతో లాభదాయక మైన పంట అని రైతులకు మేలు జరుగుతుందన్నారు.ఈ విషయం పై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.
– సిద్దిపేట సర్వ జన ఆసుపత్రిలో సాయంకాల ఒపి సేవలు…
– సీజనల్ వ్యాధులు పై అప్రమత్తంగా ఉండాలి..
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సాయంత్రం పూట ఒపి సేవలు ఉంటాయని మంత్రి హరీష్ రావు చెప్పారు.ఆసుపత్రి సూపరెండేంట్ కిషోర్ తో ఆసుపత్రి పని తీరు పై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం ఒపి సేవలు ప్రారంభించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో డెంగ్యూ , మలేరియా వంటి కేసులు వచ్చే అవకాశం ఉంది అని అందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్లేట్ లైట్స్ ఎక్కించే సేవలు అందుబాటులో ఉంచాలని మరింత మెరుగుపరచాలని సూచించారు.. ఆసుపత్రి వచ్చే పేషంట్స్ కు, కుటుంబ సభ్యులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు..
– ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలి.
కరోన భారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ప్రజలకి పిలుపునిచ్చారు.18 ఏళ్ళు నిండిన ప్రతి మనిషి రెండు డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వెళుకోవాలని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపలన్నారు.గ్రామాల్లో ఎ ఎన్ ఎం లు , ఆశ వర్కర్స్ అందుబాటులో ఉన్నారని చెప్పారు. కరోన విజృంభించే అవకాశం ఉనందున ముందు జాగ్రత్తగా అందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. రెండు దోసులు ఇప్పటికె పూర్తి అయి ఉన్నారని ఆరు నెలలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ , నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయి రాం , సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి , జడ్పిటిసి శ్రీహరి గౌడ్ , ఉమా వెంకట్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ సారయ్య , కో ఆపరేట్ చైర్మన్ లు కొల రమేష్ , సదానందం పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి , సోమిరెడ్డి , పిండి అరవింద్ , సాయి తదితరులు పాల్గొన్నారు.