ప్రగతి భవన్ లో కింద పడిన కేటీఆర్ కాలికి స్వల్ప గాయం

ఆస్పత్రిలో చికిత్స తర్వాత ప్రగతిభవన్ చేరుకున్న కేటీఆర్

హైదరాబాద్ జూలై 23 (జనం సాక్షి)

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా? అంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజావార్తలు