Wednesday, 4 November 2026

ప్రచారంలో ఆకట్టుకుంటున్న బీఎస్పీ అభ్యర్థి

బిచ్కుంద (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొగుడమీద సాయిలు తన అరుదైన శైలితో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఆయన మొదట స్వతంత్ర అభ్యర్థిగా జోరుగా ప్రచారం చేశారు. ప్రజల్లో ఉంటూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆయనకు బీఎస్పీ నుండి జుక్కల్ శాసనసభకు టికెట్ ఖరారు అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం బిచ్కుంద మండలకేంద్రం నుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం చేస్తానని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కాళ్ళు మొక్కతూ ప్రాధేయపడి వేడుకుంటున్నారు. ప్రచారంలో ఆయనతో పాటు సంతోష్, రాజు, ఉత్తమ్, రంజిత్ కుమార్, సతీష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.