వడ్డెర సంఘం అధ్యక్షులు పరుశురాం
తాండూరు అక్టోబర్19( జనం సాక్షి )
వడ్డెర సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు పరుశురాం పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వడ్డెర సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర సంగం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు .సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు పూర్తి సహకారం అందించాలని కోరారు. వడ్డెర సంఘం లో ఏలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలించి దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం కార్యదర్శి రాములు, గౌరవ అధ్యక్షులు చిన్నప్ప ,ఉపాధ్యక్షులు రాములు కోశాధికారి పాండు ,సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.




