Wednesday, 4 November 2026

రాహుల్ గాంధీ సభకు తరలి రావాలి:మాజీ మహిళాఎమ్మెల్యే అరుణ తార 

బిచ్కుంద (జనంసాక్షి) నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి సారిగా విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలందరూ ఘన స్వాగతం పలకాలని జుక్కల్ నియోజకవర్గ మాజీ మహిళా శాసనసభ్యురాలు అరుణ తార అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఏకమై వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యాసిన్, అనిల్, అహ్మద్ పటేల్, గంగాధర్, మోయిన్, సలీం మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు.