జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 31 (జనంసాక్షి) న్యూస్ : కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని జడ్పీటీసీ సలహా దారుడు, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పసునూరి యుగేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు చిన్నఅడిషర్ల పల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గడ్డం శ్రీరాములు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా మహిళలకు కళ్లద్దాలు అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల వెంకటయ్య, వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మంగ్యనాయక్, కూర సాలయ్య, డాక్టర్ రసూల్, ఆరోగ్య సిబ్బంది పంచాయతీ సెక్రటరీ, ఆశ కార్యకర్తలు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




