ప్రజలకి మరింత చేరువగా జిల్లా పోలీస్ ఠాణా దివస్ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
బోయిన్ పల్లి ఆగస్టు 01 (జనంసాక్షి):
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఠాణా దివస్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న భద్రత సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాపోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూతంగా చేపట్టిన “ఠాణా దివస్”కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనేఅధికారులుచర్యలుచేపట్టేలా ఆదేశాలుజారీచేశారు.అనంతరం ఎస్పి మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్”కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి నేరుగా ఫిర్యాదులుస్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని ఆ
సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని,తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకపోవడం సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎఫ్ ఆర్ ఐ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను
ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని సూచించారు. సివిల్ సమస్యలకు సంబంధించి సమస్యలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పించడంతో పాటు రిటైర్ ఎమ్ ఆర్ ఓ, డిఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈఅవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.. జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి ఓపికతో తమ ఫిర్యాదులను స్వీకరించడం సంతోషంగా ఉందని అర్జీదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కృష్ణ కుమార్, ఎస్.ఐ మహేందర్, ఏఎస్ఐ బాపు సిబ్బంది పాల్గొన్నారు.