మణిపూర్ లో క్రైస్తవుల పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఝరాసంగం ఆగస్టు 1 (జనం సాక్షి) :మండల కేంద్రంలో క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టినారు స్థానిక చర్చి నుండి ర్యాలీ గా వెళ్లి తహశీల్దార్ రాజిరెడ్డి కి వినతిపత్రం అందజేశారు అక్కడి నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం ముందు సమావేశంలో వారు మాట్లాడుతూ మన క్రైస్తవ ప్రజల మానాలు, ప్రాణాలు, దానాలను, మన స్వేచ్చను హరిస్తున్న వారి పై ప్రశ్నిదాం? ప్రార్థిదాం!హెచ్చరిస్తదాం!మణిపూర్ లో జరిగిన చర్యలను ఖండిస్తూ అత్యాచారం నిందితులను ఉరితీయాలి మే నెల నుండి జరుగుతున్న హింసాకాండని కాపాడలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే క్రైస్తవ జాతికి క్షేమపన చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.మణిపూర్ ముఖ్యమంత్రి విరాన్ వెంటనే రాజీనామా చేయాలి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి కవి గాయకులు రామచందర్ భీం వంశీ ఎండీఏ అధ్యక్షులు ఎండి అమీరొద్దీన్, పాస్టర్ రమేష్ బాబు లు మద్దతు సంఘీభావంగా ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ ఫోరం నాయకులు చింతల్ గట్టు శివరాజ్,రాయికోటి నర్సింలు ప్రకాష్, దేవపుత్ర, రమేష్, రాజుకుమార్,ఉప సర్పంచ్ అమృత్,విద్యాసాగర్,శ్యామయ్య,అమృత్, సుధాకర్, ప్రశాంత్, బల్ రాజ్,పౌల్ పవాన్,కరుణాకర్, వివిధ గ్రామాల్లో ని యువ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.