అల్వాల్ (జనంసాక్షి) జూలై 30
నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రెడ్డి బస్తిలో యుజిడి నిధులు 40 లక్షలతో నూతన సి సి రోడ్డు డ్రైనేజీలను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తో కలిసి ప్రారంభించారు. శనివారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లు బస్తీలు కాలనీలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్లకు నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు పైప్లైన్లు నిర్మాణాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి డిఈ మహేష్, జలమండలి అధికారి సాంబయ్య, రమేష్, ఏఈ రవళి, అనిల్, శానిటేషన్ సూపర్వైజర్ మహేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ కౌసర్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, బలవంత రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రావణ్ ముదిరాజ్, నార్ల సురేష్, రాజయ్య, గౌస్, అతిక్ బాయ్, శోభన్, వెంకటేష్ యాదవ్, నర్సింగరావు, దేవ, రమేష్, విష్ణు, శ్యాం రావు, అక్రమ్, రాము, వెంకట్రావు, వెంకట్ రాములు, కొండయ్య, శంకర్, విష్ణు, సతీష్, సరిత, తదితరులు పాల్గొన్నారు.




