ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేసిన ఎమ్మెల్యే.
మల్కాజగిరి.జనంసాక్షి.జులై
ఆషాడ బోనాల పండుగ సందర్భంగా సందర్భంగా మౌలాలి లోని ద్వారకామాయి కాలనీ,సఫిల్ గూడ కట్ట మైసమ్మ దేవాలయలలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది.ఈసందర్భంగా ఆలయ కమిటీ వారు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలు సుభిక్షంగా ఉండాలని,సకాలంలో వర్షాలు పడాలని, పంట పొలాలు బాగుండాలని అమ్మవారిని కోరుకోవడము జరిగిందని అన్నారు.ఈకార్యక్రమంలో మండల రాధ కృష్ణ యాదవ్,సతీష్ కుమార్,పిట్టల శ్రీనివాస్,భాగ్యనంద్, విజయ్ కుమార్,సంతోష్ రాందాస్,ఇబ్రహీం, బుద్ది నర్సింగ్ రావు, ఆదినారాయణ
తదితరులు పాల్గొన్నారు.