ప్రజల ఇక్కట్లు తీర్చిన గ్రామ సర్పంచ్.
శంకరపట్నం ఆగస్టు 29 (జనం సాక్షి న్యూస్ ):శంకరపట్నం మండల రిధిలోని చివరి గ్రామాలైన గద్దపాక, కాచాపూర్ గ్రామ శివారులో గల వాగు ప్రవాహానికి లో లెవెల్ వంతెన మరమ్మతునకు గురైనది దీనితో వంతెన పై రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసిన సమయాలలో వంతెన పై నీటి ప్రవాహం పెరిగి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన పలుచోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇరు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా గద్దపాక గ్రామ సర్పంచ్ గోపు విజయకుమార్ రెడ్డి తన సొంత ఖర్చులతో తెగిపోయిన ఆ లోలెవెల్ వంతెన పై మట్టిని పోసి మరమ్మతులు చేసి ప్రజలకు రాకపోకలు సాగేలా రోడ్డు మట్టితో చదును చేసి సౌకర్యవంతంగా చేశారు.మండల అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఎత్తైన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుచున్నారు.