Tuesday, 3 November 2026

ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్న విపక్షాలు

ఓటమికి  ఇవిఎంల ట్యాంపరింగ్‌ అనడం సమంజసమా?
ప్రజల మనోగతం మేరకు నేతలు సాగాలి
హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): తెలంగాణలో ఊహించని స్థాయిలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల రాజకీయాల గురించి, ప్రధానంగా ఇవిఎంల గురించి విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో బిజెపి నుంచి అధికారం పొందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు తెలంగాణ విషయం వచ్చే సరికి  తట్టుకోలేక అక్కసును ఇవిఎంలపై మోపుతున్నారు. ట్యాంపరింగ్‌ జరిగిందంటూ , కోర్టుకు వెళతామని ప్రకటించారు.  ప్రధానంగా ఈ ఫలితాలు వారికి  కోలుకోలేని షాక్‌ను ఇచ్చాయి. అందుకే మళ్లీ బ్యాలెట్‌ బాక్సులు కావాలంటున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లు ఉపయోగిస్తున్నందున ఏ మేరకు వారు బయటపడతారో చూడాలి.  ఇవిఎంలు ట్యాంపర్‌ అయ్యాయని, లేకుంటే విజయం తమదే అన్న వాదన తీసుకుని వచ్చారు. అయితే కేవలం ఇవిఎంలపైనే దోషమంతా వేయడం సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ నేతలకు కనువిప్పు కావాలి. ఎందుకు తాము ఓడిపోయామో కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ గెలవడంతో ఇదే వాదన తీసుకుని వచ్చారు. ఇవిఎంలు వద్దు ..బ్యాలెట్‌ ముద్దు అంటూ తాజాగా అంటున్నారు.  ఇవిఎంలను తానే ప్రవేశ పెట్టానని, టెక్నాలజీ అంతా తన చలవే అన్న చంద్రబాబు కూడా ఓటమితో ఇవిఎంలపై అక్కసు వెళ్లగక్కారు. ఇప్పుడు మాయావతి, మమతా బెనర్జీ,అఖిలేశ్‌ యాదవ్‌ లాంటి వారు కూడా ఇదే అనుమానం లో ఉన్నారు.మొత్తంగా ఇవిఎంల వ్యవహారం మరోమారు చర్చగా మారింది. విపక్ష పార్టీలతో పాటు, వారికి వత్తాసు పలికే విూడియా జీర్ణించుకోలేకపోతున్నది.  సంప్రదాయ విూడియాలో, సోషల్‌ విూడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలయింది. గతంలో ఎరుగని ఉత్పాతమేదో ఇప్పుడు కొత్తగా ముంచుకువచ్చిందన్న రీతిలో ఇవిఎంల బదులు బ్యాలెట్‌ పేపర్లు కావాలంటున్నారు.  ప్రజాస్వామ్యం మిథ్య, ఎన్నికలు మిథ్య, ఇవిఎంలు మిథ్య అన్న పలవరింత మొదలయ్యింది. ఫలితాలు ఇలా దారుణంగా ఉండడం నిజంగానే వారికి కునుకు పట్టనీయడం లేదు. ఇంత అన్యాయమూ,అవాంఛనీయమూ, అనివార్యమూ అయిపోయిందే అనుకుంటున్నారు.  ప్రజల కోసం పనిచేసేవారు ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల పక్రియలో నెగ్గుకురాలేక పోవడం ద్వారా తమ అసంతృప్తిని మరో రకంగా వెళ్లగక్కుతారు. రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్వాతంత్యాన్రంతరం జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికలలో ఓడిపోయారు. అనేక మంది కమ్యూనిస్టు యోధానుయోధులు తమ ముందు అల్పులయినవారితో ఓటమి
రుచిచూశారు. అందుకు ప్రజలను నిందించడమా, ఎన్నికల వ్యవస్థలోని లొసుగులను, లేదా మొత్తంగా వ్యవస్థీకృతమైన ఆధిపత్యాన్ని తప్పుపట్టడమా సరికాదు. ప్రజలు ఎప్పటి కప్పుడు చైతన్యం అవుతున్నారు.  ఇదంతా ఇవిఎంల వల్లనే అంటే ఎలా? ప్రజల ఆలోచనాధోరణి,వారి అసంతృప్తిని  పసిగట్టకుండా అహంకారంతో తామే గెలుస్తామని, గెలవాలని అనుకుని అలా జరగకపోవడంతో  ఇవిఎంల ట్యాంపరింగ్‌ అని ఓటమిని విశ్లేషించుకుంటే దానికి బాధ్యులు ప్రజలు కాదు. ప్రజాస్వామ్యం విూద సవారీ చేస్తూ అధికార పీఠాల విూద నిలబడ్డవారి స్వభావం, లక్ష్యం అధికారం కావడం వల్లనే విశాల ప్రజానీకం తమవంతు కర్తవ్యాన్ని అవసరమైనప్పుడు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యమంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సమాజంలోని అనేక రంగాలలో ప్రజాస్వావ్యిూకరణ కోసం ప్రయత్నాలు స్వాతంత్యాన్రికి పూర్వం నుంచీ జరుగుతున్నాయి. అధికారం అనుభవించాలనుకునే వారికి ఈ ఎన్నికలు ఓ గుణపాఠం కావాలి. వైఫల్యాన్ని గుర్తించని, గుణపాఠాలను తీసుకోని వారు, చివరకు పురోగామి శక్తులు కూడా, పొరపాటును ఈవీఎంల విూదకు తోసివేస్తారు. ఇవిఎంల తప్పిదాలను లెక్కపెట్టకుండా తమ తప్పిదాలను సరిచూసుకుంటే మంచిది.
——————-