:
నాగోల్ డివిజన్ బీజేపి కార్పోరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్
కార్పోరేటర్ చేతులమీదుగా జనం సాక్షి దినపత్రిక 2022 క్యాలెండర్ ఆవిష్కరణ
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న పత్రిక ‘జనంసాక్షి ‘అని నాగోల్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పేర్కొన్నారు .మంగళవారం నాడు నాగోల్ లో డివిజన్ బిజెపి కార్యాలయంలో కార్పోరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలు నాయకులతో కలసి జనంసాక్షి నూతన ఆంగ్ల సంవత్సర 2022క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్భంగావకార్పోరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాయడంలో జనంసాక్షి ముందుంటుందని అన్నారు .ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు న్యాయం జరిగే వరకు జనం సాక్షి దినపత్రిక నిరంతరం పని చేయడం అభినందనీయమని పేర్కొన్నారు .కార్మిక ,కర్షక ,శ్రామిక ,రైతుల, పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జనం సాక్షి పత్రిక నిరంతరం కృషి చేయాలని సూచించారు .ఈ నూతన ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు . ఈ కార్యక్రమంలో జనం సాక్షి జర్నలిస్టు బాణాల మధుసూదనాచారి బిజెపి డివిజన్ ఉపాధ్యక్షురాలు అనిత ,బాలాజీ నాయక్ ఎస్ ప్రభాకర్ కాసోజు రాఘవాచారి, తదితరులు పాల్గొన్నారు




