ప్రజావాణి ధరకాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
–జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..
హన్మకొండ బ్యూరో 29 ఆగస్టు జనంసాక్షి
సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాట్లాడుతూ
ప్రజావాణి ద్వారా వచ్చిన ధరకాస్తు లను పరిశీలించి తగు చర్యలు తీసుకోని ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో ( 102 ) ధరకాస్తులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.కార్యక్రమలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.