Tuesday, 3 November 2026

రాష్ట్ర మహాసభల హాల్ పోస్టర్ ఆవిష్కరణ అంజయ్య చారి

నాంపల్లి ఆగస్ట్ 29(జనం సాక్షి )నాంపల్లి మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలోని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ  మహాసభల సందర్భంగా సోమవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆర్ అంజయ్య చారి వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మూడవ రాష్ట్ర మహాసభ సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలనిపేర్కొన్నారు. మహాసభకు అధిక సంఖ్యలో వేలాది మంది తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్ సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య, నేతాల రాజు, సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు గిరి స్వామి, పల్లె సైదులు, మోగుదాల సైదమ్మ, బుషిపాక గోపాల్, మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.