Thursday, 5 November 2026

ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో.జనం సాక్షి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో ఏర్పాటు చేసిన ప్రజా వాణి సమావేశం లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు,దరఖాస్తులు స్వీకరించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తదనంతరం ప్రజా పిర్యాదులను స్వీకరించారు. మొత్తం ప్రజల నుండి దరఖాస్తులు, వాటిలో భూ సమస్యలు, ఇతర సమస్యలు, పింఛన్లు, విద్య తదితర సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.