Thursday, 5 November 2026

మట్టి గణపతులను పూజించండి .. కార్పొరేటర్ హేమ

సికింద్రాబాద్ (జనం సాక్షి ):   చిలకలగూడలోని శ్రీ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయ అవరణంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు   చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ  పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కార్పొరేటర్ సామల హేమ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎం హెచ్ ఓ రవీందర్  , ఆలయ ఈ ఓ మహేందర్ గౌడ్, తెరాస నాయకులు , శైలేందర్ తదితరులు పాల్గొన్నారు