ప్రజాసంఘ్రమయాత్రను అడ్డుకోలేరు… బిజెపి అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి జనగామ( జనం సాక్షి)ఆగస్ట్23: ప్రజాసంఘ్రమయాత్ర లో భాగంగా ఘనపూర్ లో జరుగుతున్నటువంటి పాదయాత్రని టిఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేనితనంతో ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి బండి సంజయ్ యొక్క పాదయాత్రని పోలీసుల మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు కలిసి పాదయాత్రని అడ్డుకొని బండి సంజయ్ ని అన్యాయంగా అరెస్టు చేయడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చింపివేయడం కాల్చి వేయడం జరిగింది బండి సంజయ్ ని జిల్లా నలువైపులా త్రిప్పి చివరికి కరీంనగర్ లోని తన గృహమునకు తీసుకువెళ్లి గృహనిర్బంధం చేశారు పాదయాత్ర చివరి దశలో ఉన్నప్పటికీ పూర్తి కాకుండా ప్రజల్లో అభద్రతాభావం కలిగించడానికి ఈ నీచమైన చర్య టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినందుకు ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకి విశేష ప్రజాదరణ రావడం భరించలేని కేసీఆర్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని జనగామ జిల్లా బిజెపి అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి వివరించడం జరిగింది లిక్కర్ మాఫియా తో సంబంధాలు పెట్టుకుని బయటపడ్డ కల్వకుంట్ల కవిత విషయాన్ని బయటపెట్టి ధర్మదీక్ష చేసిన బండి సంజయ్ ని టిఆర్ఎస్ ప్రభుత్వం అండతో పోలీసు అధికారులు దీక్ష భగ్నం చేశారు బయట అన్ని వర్గాల వారు చర్చిస్తున్న సమయంలో ఈ విషయాన్ని దారి మళ్లించడానికి ఈ సంఘటన అడ్డుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం అతి తెలివిగా ప్రవర్తిస్తుందని తెలియజేశారు ఈ సంగ్రామ యాత్రను తాత్కాలికంగా అడ్డుకున్నప్పటికీ బిజెపి పార్టీ తప్పనిసరిగా యాత్రను పూర్తి చేస్తుందని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని భయపడే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నీచమైన పనులు చేయడం సిగ్గుచేటని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ రెడ్డి కే వి ఎల్ ఎన్ రెడ్డి పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు ఉడుగుల రమేష్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు రమేష్ కర్రి శ్రీనివాస్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప బిజెపి జిల్లా ప్రచార కార్యదర్శి పెద్దోజు జగదీష్ పవన్ శర్మ కాసుల శ్రీనివాస్ విజయకుమార్ మొదలగు వారు పాల్గొన్నారు
ప్రజాసంఘ్రమయాత్రను అడ్డుకోలేరు… బిజెపి అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి




