ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు గౌరవం లేదు: తెదేపా

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీల విషయంలో కనువిప్పు కలిగిందని ఆ పార్టీ నేతలు గాలి ముద్ద కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితులందరికీ న్యాయం  జరిగేలా బిల్లు ఉండాలని డిమాండ్‌ వ్యక్తం చేసిన నేతలు, బిల్లు ఆ కరంగా ఉండకపోతే సవరణ కష్టమన్నారు. బీఏసీలో తొలుత రెండు రోజులే సమావేశాలు నిర్వహిస్తామాని తెలిపారని, ఆ తర్వాత రకరకాల సమస్యలను ప్రస్తావనకు తెస్తే ఈ నెల 10 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించారన్నారు. ధర్మాన అంశాన్ని కూడా బీఏసీలో చర్చించామని, ఆ అంశాన్ని సభలో చర్చకు అనుమతించాలని కోరగా శీతాకాల సమావేశాల్లో చూద్దామని స్పీకర్‌ చెప్పినట్లు నేతలు తెలియజేశారు.